ఈ రోజు మీరు జీవత బీమా ప్రాముఖ్యతను తెలుగులో (Importance of Life Insurance in Telugu) వివరంగా తెలుసుకోబోతున్నారు. ఈ బుద్బుద ప్రాయమైన జీవితంలో, మీ పరోక్షం లో మీ సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్నవారి ఆర్థిక సంరక్షణ గురుంచి ఎప్పుడైనా ఆలోచించరా? అసలు జీవిత బీమా ప్రాముఖ్యత తెలుగులో (Importance of Life Insurance in Telugu) అనే ఈ సోదాహరణ వ్యాసం ద్వారా దాని ఆవశ్యకత గురుంచి ఇంకా …

ఈ క్రొత్త గైడ్‌లో మీరు నేర్చుకునేది ఏమిటంటే :
జీవిత బీమా అంటే ఏమిటి ?
జీవిత బీమా ఎవరికి ? ఇది ఎవరెవరికి అవసరము ?
బీమా ఎందుకు తీసుకోవాలి ?
జీవత బీమా పట్ల సాధారణం గా ఉండే సందేహాలు వాటి కి సమాధానం …
మరిన్ని ఆసక్తి కలిగించే విషయాలు …
ప్రారంభిద్దామా మరి!
టూకీగా బీమా అంటే?
దాని అవసరం మనం జీవించినంత కాలం రాదు; కానీ దాని అవసరం వచినప్పుడు , మనము ఉండము .
అదే బీమా!
జీవిత బీమా నిర్వచనం Life Insurance Definition in Telugu :
జీవిత బీమా అనేది బీమా చేయు సంస్థ మరియు పాలసీదారుడి మధ్య ఒక ఒప్పందం, దీనిలో బీమా చేసిన వ్యక్తి మరణించిన తరువాత నామినీ (పేరున్న లబ్ధిదారుల)కు మరణ ప్రయోజనం చెల్లించమని బీమా హామీ ఇస్తుంది. బీమా సంస్థ ప్రీమియం చెల్లింపును పరిగణనలోకి తీసుకుని మరణ ప్రయోజనాన్ని హామీ ఇస్తుంది. ఈ బీమా హామినే sum assured అంటారు. వయస్సును బట్టి బీమా ప్రీమియం మారుతుంది. అనగా వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది అన్నమాట. కావున ఎంత చిన్న వయస్సు లో (19 సంవత్సరాలు నుండి )తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం పడుతుంది అన్నమాట .
బీమా అనగానే కొన్ని సర్వ సాధారణ ప్రశ్నలు ఉదయిస్తాయి. అవి :
పేదలకు బీమా: పేదవాడిగా ఇల్లు నడపడం కష్టం అయినప్పుడు;బీమా ప్రీమియం ఎలా చెల్లించాలి?అనేది వారి ప్రశ్న.
మీరు జీవించి ఉన్నప్పుడే జీవనోపాధికి కష్టంగా ఉన్నప్పుడు, మీరు లేనప్పుడు పరిస్థితిని ఆలోచించండి. కావున , బీమా తప్పదు వారికి .
ధనికులకుబీమా: నా దగ్గర చాలా డబ్బు / ఆస్తులు ఉన్నాయి. మరి , నాకు బీమా ఎందుకు?
ఆస్తులు అనుభవించడానికి కాని అమ్మి అరయించి తినడానికి కాదు కదా ? ప్రత్యేకంగా కేవలం నెలవారీ ఖర్చులు రూ.30,000 నుండి రూ.40000 వరకు తీర్చడానికి మీరు కుటుంబానికి రూ.30 లక్షలు-రూ.40 లక్షలు ఏ బ్యాంకు లోనో పోస్ట్ ఆఫీస్ లోనో జమ చేస్తే ఫర్వాలేదు. లేకపోతే, తక్కువ మొత్తంలో బీమా ప్రీమియం చెల్లించడం సులభం. అంత కష్టం కాదు.
ఇక మధ్యతరగతి వారి గురించి చెప్పాలంటే కుటుంబ యజమానికి ఏమైనాఐతే వారి కుటుంబ సభ్యులు ఒక వైపు వెంటనే కూలో నాలో చేసే /పని చేసి తక్కువ జీవన శైలి విధానంలో జీవనo వెళ్లదీసే పరిస్థితిలేక, మరో వైపు బంధువుల నుండి సాయం అడగలేక, అత్యవసర సమయాన డబ్బు లేక చాలా అవస్థలు పడే పరిస్థితి వస్తుంది. ఇట్టి విపత్కర పరిస్థితి మీ కుటుంబ సభ్యులకు రాకుదంటే లక్షల రూపాయల బీమా కోసం కొన్ని వందలు ఖర్చు పెట్టాల్సిందే. అది వారి జీవితం ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగటానికి ధైర్యన్నిచ్చే ఒక వెసులుబాటు. దాన్ని తప్పక వాడుకోవాడం కుటుంబాన్ని ప్రేమి౦చేవారిగా మీ బాధ్యత మరియు తెలివిగలవాని లక్షణం.
కావున , ధనిక, పేద మరియు మధ్యతరగతి అనే భేదం లేకుండా ఎవరికి అయిన బీమా అవసరమే.
జీవితంలోని కొన్ని ఆర్థిక లక్ష్యాలు:
1.పిల్లల విద్య
2.కొడుకు / కుమార్తె వివాహం
3.ఇంటిని నిర్మించడం / కొనడం / ఆస్తిని సొంతం చేసుకోవడం
4.సొంత అపార్ట్ మెంటు కు తరలడం .
5.జీవితంలో కారు / సౌకర్యాలను కొనడం .
6.కొత్త నగరానికి వెళ్లడం .
7. పదవీ విరమణ తర్వాత తగు ఆదాయం తో మేరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రణాళిక.
సంపాదించే వ్యక్తి/కుటుంబ పోషణ చూసే వ్యక్తి లేనప్పుడు కూడా ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, బీమాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్క రోజు కూడా బీమా లేకుండా సంపాదించే వ్యక్తి ఉండకూడదు. అనగా సంపాదన ఉండి, వారి సంపాదన పైన మీద ఆధారపడే కుటుంబ సభ్యులు ఉన్న ప్రతివారు బీమా చేయవలసిందే .
ప్రమాదాన్ని ఎలా నిర్వహించాలి?
1.తప్పించుకోవడం: ప్రమాదం కారణంగా చూపి కార్యాచరణలో పాల్గొనకూడదని ఎంచుకోవడం ఒక మార్గం.
ఉదా:- కారు /మోటార్ బైక్ నడిపితే ప్రమాదం జరగ వచ్చునని డ్రైవర్ లైసెన్స్ పొందకుండ ఉండటం; విమానం హైజాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని రిస్క్ తీసుకోకుండా విమానంలో ఎగుర కుండ ఉండటం. ఈ మార్గం అన్నిసార్లు కుదరదు అని ఒప్పుకుంటారుగా? ఇక 2 వ మార్గం చూద్దాం .
2. నిలుపుదల: భవిష్యత్తులో నష్టపోయే సందర్భం ఎదుర్కోవడం కోసం ఇప్పుడే డబ్బు ఆదా చేయడం.
ఉదా:- జీవిత ప్రమాదంలో పడవచునని అలోచించి , ఆ సందర్భంలో ఉపయోగించడానికి ఇప్పుడే రూ .5 నుండి 50 లక్షలు ను బ్యాంకు ఖాతాలో జమ చేయడం; ఇది ఏ కొందరికో సాధ్యo . మరి మార్గం ఏమిటో చూద్దాం …
3. బదిలీ: బీమా సంస్థకు ప్రమాదం / ప్రమాదాన్ని బదిలీ చేయడం.
ఉదా.బీమా పాలసీకి రుసుముగా నెలవారీ ప్రీమియం చెల్లించడం తద్వారా బీమా సంస్థ మీ ఆస్తులను కాపాడుతుందని ఆశించడం. ఇది అన్నింటికన్నా తెలివైన పనే కాక తేలిక కూడాను.
జీవిత బీమా ప్రాముఖ్యత తెలుగులో (Importance of Life Insurance in Telugu) అనే ఈ వ్యాసం ద్వారా మీరు అది ఎలా సాధించ వచ్చో వివరంగా తెలియ చేస్తాను.
బీమా అంటే ఏమిటి , ఎందుకు, ఎలా? :
జీవిత బీమా అంటే ఏమిటి what is life insurance in Telugu?:
బీమా చేసిన పాలసీ దారు మరణిచినప్పుడు నామినీకి చెల్లించే పరిహారం ఇది. బీమా చేసిన పాలసీ దారు సజీవంగా ఉన్నప్పుడు మాదిరిగానే తను కాలం చేసినతర్వాత కూడా పిల్లల జీవనశైలి / విద్యను కొనసాగించడం / పైన తెలిపిన ఆర్థిక లక్ష్యాలు వంటి వాటికి ఏలోటు లేకుండా చూసుకోవడానికి ఉపయోగ పడేదే బీమా.
జీవిత బీమా ఎందుకు?
అందరమూ ఈ క్రింది పేర్కొన్న ప్రమాదాలను ఎదుర్కొంటాము :
(1) చాలా త్వరగా చనిపోవడం . మిగతా కుటుంబ సభ్యుల జీవనోపాధికి సరైన ఏర్పాట్లు చేయకుండానే, సంపాదించే కుటుంబ సభ్యుడు ఈ ప్రపంచం త్వరగా వీడితే, ఆ కుటుంబం ప్రమాదంలో పడుతుందని అందరూ అంగీకరిస్తారు.
(2) చాలా కాలం జీవించడం:- అవును, అది కూడా ప్రమాదమేనా/ రిస్కేనా అని ఆశ్చర్యపోతున్నారా? పదవీ విరమణ అనంతర జీవనోపాధిని ప్రణాళిక వేసుకోక పోతే/చేయకపోతే, ఎవరూ మన గురించి పట్టించుకోని ప్రమాదం ఎక్కువగా ఉంటు౦దని మన అందరికి బాగా తెలిసిందే .
ఎప్పుడు చెయ్యాలి జీవిత బీమా?
సమాధానం: ‘‘ ఇప్పుడే ’’. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మీరు ఈ లోకం లో లేనప్పుడు కూడా మీ కుటుంబానికి మీరు వ్రాయగల ఉత్తమ ప్రేమ లేఖే “ బీమా ’’. (ఎప్పుడు బీమా అనే ఈ ప్రశ్నకు అందరు వయసు మీరిన తర్వాత అనే సమాధానం తో సన్నధం గా ఉంటారు, కానీ మీ ఆలోచన ఇప్పుడు మరాలి మరి).
జీవిత బీమా ఎందుకు అవసరం? జీవిత బీమా ఆవశ్యకత Importance of life insurance in Telugu:
మీ అకస్మాత్తు మరణం సంభవించినప్పుడు మీ తక్షణ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం ఉందని నిర్ధారించు కోనడానికి.
మీ పిల్లల విద్య మరియు ఇతర ఆర్థిక అవసరాలకు ఉపయోగపడడం కోసం .
పదవీ విరమణ తర్వాత మీకు స్థిరమైన ఆదాయ వనరు ఉండేలా భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికను ఇప్పటినుండే కలిగి ఉండటం కోసం .
అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా మీ ఆదాయాలు తగ్గినప్పుడు మీకు అదనపు ఆదాయం ఉందని నిర్ధారించు కోనడానికి.
ఇతర ఆర్థిక ఆకస్మిక పరిస్థితులు మరియు జీవనశైలి అవసరాలను మీ పరోక్షంలో కూడా ఏ లోటు లేకుండా కొనసాగించడం కోసం .
జీవిత బీమా ఎంత అవసరం?
జీవిత బీమా ఎంత అవసరం అనేది ముఖ్యంగా మన జీవిత ఆర్థిక విలువ పై ఆధారపడివుంటుంది. వ్యక్తిగా మనం లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు అనే విషయం ఎవరు కాదనలేనిది. కానీ, ఆర్థికంగా వారి జరుగుబాటుకు లోటు రాకుండా తగు ఏర్పాటు చేయడంలో విఫలం అవరాదు. టూకీగా చెప్పాలంటే, జీవిత ఆర్థిక విలువ అనేది మీ జీవనకాలంలో మీ భాద్యతలు ఆసాంతం తీరేవరకు మొత్తం సంపాదన అవకాశం గా చెప్పవచ్చు. మరింత లోతు గా చెప్పాలంటే , మీకు అవసరమైన జీవిత బీమా పాలసీ వల్ల లభించే భద్రతా పరిమితి (insurance coverage) మొత్తం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఏమనగా :
మీ మీద ఆధారపడి జీవించే కుటుoబ సభ్యులు మీకు ఎంత మంది ఉన్నారు?
కుటుంబానికి మీరు ఎలాంటి జీవనశైలిని అందించాలనుకుంటున్నారు?
మీ పిల్లల విద్య కోసం మీకు ఎంత అవసరం
మీకు పెట్టుబడి అవసరాలు ఏమిటి
మీ స్థోమత ఏమిటి?
సాధారణంగా, ఇది ఈరోజు నుండి మీ ఉద్యోగ విరమణ వరకు జీతము మరియు ఆదాయం. ఒక వేళ ఉద్యోగి కానట్లయితే రాబోయే 40 సంవత్సరాల ఇతర ఆదయo లేదా ఇతరత్రా అందించే మొత్తంకి సమానం అనవచ్చు. ఆర్థిక నిపుణులు బీమా అనేది సంవత్సరానికి స్థూల జీతం మీద కనీసం 10 రెట్లు కంటే తక్కువ ఉండకూడదని చెబుతారు .
మనిషి ఆర్థిక విలువ ఎంత?
దానిని గణిoచుట
మనిషి జీవిత ఆర్థిక విలువ = సంవత్సరాదాయము X భవిష్యతు సంపాదన కాలము (సంవత్సరాలలో )
ఉదా:- సంవత్సరాదాయము= 2.5 లక్షలు ; ప్రస్తుత వయస్సు : 40 సం II ;; రిటైర్మెంట్ :60 సం II
సంపాదన కాలము (సంవత్సరాలలో )=60-40 =20 సం II , కావున , ఈ ఉదాహరణ లో
మనిషి జీవిత ఆర్థిక విలువ= 2.5 లక్షలు x 20 = Rs 50 లక్షలు .
మరి ఇంకెoదుకు ఆలస్యo! మీకు బీమా ఎంత అవసరమో లెక్క వేయండి!
Sum Assured అంటే? : ప్రయోజన పాలసీ కింద బీమా చేయబడిన సందర్భములో మరణం వంటి సంఘటనలు సంభవించినప్పుడు నామినీకి చెల్లించవలసిన మొత్తము ను sum assured అంటారు. బీమా ద్వారా నష్టాన్ని పూరించడానికి ఇచ్చిన వ్యవధిలో చెల్లించ వలసిన ప్రీమియం మొత్తం గా కూడా చెప్పవచ్చు.
బీమాదారుడి(insurant) మరణం సంభవించినప్పుడు, జీవిత బీమా పాలసీ ఈ క్రిoది వాటికి సహాయపడుతుంది:
బీమా యొక్క లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయుటకు .
పాలసీ దారు యొక్క పిల్లల కళాశాల విద్య కోసం అందించడం కోసం
అంత్యక్రియలు లేదా ఎస్టేట్ సెటిల్మెంట్ ఖర్చుల యొక్క తుది ఖర్చుల కోసం చెల్లించడా నికి .
ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని నిర్వహించడానికి అత్యవసర నిధిని అందించడానికి
పాలసీ దారుని యొక్క అప్పుల ను తీర్చడానికి / పరిష్కారించడానికి.
బీమా వ్యవధి ఎందుకు ఎక్కువ కాలం ఉండాలి?
3 కారణాల వల్ల బీమా పాలసీని స్వల్ప కాలానికి బదులుగా ఎక్కువ కాలం తీసుకోవాలి. అవి :
(i) తక్కువ కాలమునకు బీమా ప్రీమియం కన్నా ఎక్కువ కాలమునకు బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది
(ii) కాలము(సంవత్సరాలు) ఎక్కువ అయిన కొలది అందుకునే బోనస్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, అంటే మెచ్యూరిటీ విలువ ఎక్కువగా ఉంటుంది.
(iii)బీమా రక్షణ గొడుగు అవసరమై కాలము అనగా 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ తక్కువ వ్యవధికి బీమా తీసుకుంటే, అనారోగ్యం ద్వారా ప్రాణ ప్రమాదం తక్కువగా ఉంటుంది. నిజంగా అనారోగ్య సమస్యలు 40 సంవత్సరాలు తర్వాత సాధారణo గా ఎక్కువ గా వస్తాయి (ఉదా : బిపి , సుగరు వ్యాధి , గుండె పోటు వంటివి వయస్సు మళ్ళిన కొద్దీ పెరుగుటకు అవకాశం ఎక్కువ అని తెలిసిందే ).
బీమా గురించి అపోహలు / సందేహాలు?
ప్రశ్న (i): కొందరు, నేను వయస్సులో ఉన్నాను (యంగ్), మరియు నాకు ఇప్పుడు అనారోగ్యం నుండి ప్రమాదం లేదు. కాబట్టి, నాకు బీమా అవసరం లేదు.
జవాబు:బహుశా నిజమే కావచ్చు. కానీ, అతను 10 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసినప్పుడు బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, తరువాత క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకనే, వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు పెద్దలు.
ప్రశ్న (ii): నేను ఒక నిర్దిష్ట ఆర్థిక లక్ష్యం కోసం తక్కువ కాలానికి బీమాను తీసుకుంటాను. సుదీర్ఘ కాలం ఎందుకు?
జవాబు:ఇప్పటికే ఈ విషయం గురించి పైన చర్చించడం జరిగింది. అంత అత్యవసర పరిస్థితుల్లో అయితే బీమా పాలసీ నందు ఋణం తీసుకోవచ్చు మరియు తర్వాత ఋణం తీర్చు కొనవచ్చును.
ప్రశ్న (iii): నేను చెల్లించే ప్రీమియం డబ్బును నేను ఆస్వాదించటం లేదు. నేను పోయిన తర్వాత డబ్బు నాకు రాదు కదా ? అప్పుడు, నాకు ఎందుకు బీమా?
జవాబు: ఎందుకంటే మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తారు కాబట్టి. మరియు మంచి జీవనశైలి / విద్య / వివాహం / జీవితంలో స్థిరపడటం కోసం వారు అనుభవించే బాధను మీరు ఊహించలేరు కాబట్టి.
మరి జీవిత బీమా ను అందించే చాలా రకాల సంస్థ లు అందులో వివిధ రకాల పాలసీలు ఉన్నాయి కదా వాటిని ఎంపిక చేసుకోనే ది ఎలా?
ముందుగా మరి జీవిత బీమా ను అందించే చాలా రకాల సంస్థ ల ను చూద్దాం :
SL | Company | Sector | Headquarters | Founded |
1 | Postal Life Insurance(PLI) | Central Govt | Delhi | 1886 |
2 | Rural Postal Life Insurance(RPLI) | Central Govt | Delhi | 1995 |
3 | Life Insurance Corporation of India(LIC) | Public | Mumbai | 1956 |
4 | HDFC Standard Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2000 |
5 | Max Life Insurance Co. Ltd. | Private | Delhi | 2000 |
6 | ICICI Prudential Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2000 |
7 | Kotak Mahindra Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2001 |
8 | Aditya Birla Sun Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2000 |
9 | TATA AIA Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2001 |
10 | SBI Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2001 |
11 | Exide Life Insurance Co. Ltd. | Private | Bangalore | 2001 |
12 | Bajaj Allianz Life Insurance Co. Ltd. | Private | Pune | 2001 |
13 | PNB MetLife India Insurance Co. Ltd. | Private | Mumbai | 2001 |
14 | Reliance Nippon Life Insurance Company | Private | Mumbai | 2001 |
15 | Aviva Life Insurance Company India Ltd. | Private | Gurugram | 2002 |
16 | Sahara India Life Insurance Co. Ltd. | Private | Lucknow | 2004 |
17 | Shriram Life Insurance Co. Ltd. | Private | Hyderabad | 2005 |
18 | Bharti AXA Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2008 |
19 | Future Generali India Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2007 |
20 | IDBI Federal Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2008 |
21 | Canara HSBC Oriental Bank of Commerce Life Insurance Co. Ltd. | Private | Gurugram | 2008 |
22 | Aegon Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2008 |
23 | Pramerica Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2008 |
24 | Star Union Dai-Ichi Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2008 |
25 | IndiaFirst Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2009 |
26 | Edelweiss Tokio Life Insurance Co. Ltd. | Private | Mumbai | 2011 |
ఇన్సూరెన్స్ పాలసి లలో రకాలు:
1. ఎండోమెంట్ పాలసి :ఎండోమెంట్ పాలసీ బీమా చేసిన వ్యక్తి యొక్క జీవితాన్ని కవర్ చేయడమే కాకుండా, పాలసీదారునికి ఒక నిర్దిష్ట వ్యవధిలో క్రమం తప్పకుండా ఆదా చేయడంలో సహాయపడుతుంది, తద్వారా అతను / ఆమె పాలసీ పరిపక్వతపై ఏకమొత్తాన్ని పొందగలుగుతారు. ఈ మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకరి పదవీ విరమణ, పిల్లల విద్య మరియు / లేదా వివాహం లేదా ఇల్లు కొనడం వంటి వివిధ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు.
2. హోల్ లైఫ్ పాలసి: హోల్ లైఫ్ పాలసి అనేది టర్మ్ ఇన్సూరెన్స్ అనే పదానికి భిన్నంగా ఉంటుంది-హోల్ లైఫ్ పాలసి నిర్దిష్ట సంII కాకుండా జీవితం మొత్తం అందుబాటులో ఉంటుంది మరియు మరణ ప్రయోజనం మరియు పొదుపు భాగం కూడా చెల్లిస్తుంది.
3. కన్వర్ట్ బుల్ హోల్ లైఫ్ పాలసి: కన్వర్టిబుల్ టర్మ్” పాలసీ బీమాదారుడు టర్మ్ పాలసీని శాశ్వత పాలసీగా మార్చడానికి అనుమతిస్తుంది. పాలసీ యొక్క షరతులు నిర్వహించబడుతున్నంత వరకు మరియు సమయానికి చెల్లింపులు జరిపినంత వరకు, బీమా చేయబడిన వ్యక్తి అతని / ఆమె వైద్య పరిస్థితులతో సంబంధం లేకుండా పాలసీ మార్చబడిన సమయంలో కొత్త లేదా అదనపు స్క్రీనింగ్ చేయవలసిన అవసరం లేదు. బీమా అవసరాలు మరియు ఆర్థిక వనరులు మారినందున తరువాతి తేదీలో శాశ్వత పాలసీకి మారే అవకాశాన్ని కొనసాగిస్తూ, ఈ రకమైన పాలసీ ఇప్పుడు తక్కువ ఖరీదైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పొందే ప్రయోజనాన్ని అందిస్తుంది.
4. చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లు :చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మైనర్ జీవితానికి బీమా చేసే శాశ్వత జీవిత బీమా. పిల్లల అంత్యక్రియలు లేదా ఖననం యొక్క ఆకస్మిక మరియు ఊహించని ఖర్చులకు తట్టు కునేందుకు గాను ఒక కుటుంబాన్ని రక్షించడానికి మరియు పిల్లల జీవితకాలం కోసం చవకైన మరియు బీమాహామీ ను పొందటానికి ఇది సాధారణంగా కొనుగోలు చేయబడుతుంది. ఇది నగదు విలువ యొక్క గ్యారెంటీ వృద్ధిని అందిస్తుంది.
5. మనీ బ్యాక్ పాలసి :ఈ పాలసీ తీసుకుంటే చెల్లించిన డబ్బులు తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు. అలాగే పాలసీ తీసుకున్న తర్వాత మరణిస్తే డెత్ బెనిఫిట్స్ అందజేస్తారు. దశల వారిగా మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా డబ్బు ను పొందటాని వీలుగా ఉంటుంది .
6. రిటైర్మెంట్ ప్లాన్ లు : పెన్షన్ లేదా పదవీ విరమణ పధకాలు పెట్టుబడి మరియు బీమా రక్షణ యొక్క ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తాయి. మీ పెన్షన్ ప్లాన్ వైపు క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దశల వారీగా గణనీయమైన మొత్తాన్ని పొందుతారు. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత ఇది స్థిరమైన నిధుల ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.
7. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్:టర్మ్ ఇన్సూరెన్స్ జీవితకాలం కాకుండా నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు మరణ ప్రయోజనం మరియు పొదుపు భాగం కాకుండా మరణ ప్రయోజనాన్ని మాత్రమే చెల్లిస్తుంది.
8. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాను లు: యులిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. యులిప్ బీమా మరియు పెట్టుబడి కలయిక. ఇక్కడ పాలసీదారుడు నెలవారీ లేదా ఏటా ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం యొక్క కొద్ది మొత్తం జీవిత బీమాను పొందటానికి వెళుతుంది మరియు మిగిలిన డబ్బు మ్యూచువల్ ఫండ్ మాదిరిగానే పెట్టుబడి పెట్టబడుతుంది.
9. సేవింగ్స్ & ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లు : పొదుపు & పెట్టుబడుల ప్రణాళిక. ఈ పొదుపు మరియు పెట్టుబడి ప్రణాళికలు జీవిత బీమా పథకాలు, ఇవి మీ డబ్బును ఆదా చేయడానికి మరియు పెంచడానికి బహుళ మార్గాలను అందిస్తాయి. ఈ ఆన్‌లైన్ పెట్టుబడి ప్రణాళికలు మీరు మరియు మీ కుటుంబ ఆర్థిక లక్ష్యాలను సాధించగలవని నిర్ధారించడానికి క్రమబద్ధమైన మరియు క్రమశిక్షణ కలిగిన పెట్టుబడికి సహాయపడతాయి.
మీకు ఎలాంటి జీవిత బీమా అవసరమో నిర్ణయించేటప్పుడు ఎంచుకోవడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. మీ వయస్సు మరియు వ్యక్తిగత పరిస్థితి మీకు అత్యంత అవసరమైన జీవిత బీమా కవరేజ్ ఏమిటో, అలాగే మీరు ఎంత భరించగలదో నిర్దేశిస్తుంది.
ప్రతి కొన్ని సంవత్సరాలకు లేదా మీ కుటుంబ పరిస్థితి మారినప్పుడల్లా,మీ జీవిత బీమా ఎంపికలను మరియు మరణ ప్రయోజనం మొత్తం మరియు లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఎల్లప్పుడూ సమీక్షించండి.
సరే ఇక మీరు జీవత బీమా ప్రాముఖ్యత తెలుగులో (Importance of Life Insurance in Telugu) అన్న ఈ క్రొత్త గైడ్‌ను ఆస్వాదిస్తారని నేను నిజంగా ఆశిస్తున్నాను.
ఇప్పుడు నేను మీ నుండి వినాలనుకుంటున్నాను.
నేటి గైడ్ నుండి ఏ చిట్కా మీరు మొదట ప్రయత్నించబోతున్నారు?
మీరు జీవిత విలువ ముందుగా లెక్కించటాన్ని ప్రయత్నించబోతున్నారా?
లేదా మీరు మీకు మరియు మీ కుటుంబానికి జీవిత బీమా ఎంత అవసరమో లెక్క వేయలనుకోవచ్చు.
ఏది ఏమైనప్పటికి , ఈ క్రింద మీ కామెంట్ రూపంలో జీవిత బీమా ప్రాముఖ్యత తెలుగులో (Importance of Life Insurance in Telugu) గురుంచి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి.